ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే
పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండల కేంద్రంలోని FSCS, మల్లంపల్లి, వావిలాల గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సి రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మద్దతు ధరతో నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకునే సదుపాయం కల్పించడం ఎంతో ప్రాధాన్యత కలిగిందన్నారు. మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరుగుతుందని, రైతులకు సమయానికి చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇలాంటి కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఆదాయ మార్గాలు మెరుగవుతాయన్నారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ, రైతుల కష్టాన్ని గౌరవిస్తూ, పంటలకు మంచి మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ కేంద్రాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
కామాఖ్య క్లినిక్ ప్రారంభం
పాలకుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మూల వెంకటేశ్వర్లు గౌడ్ నూతనంగా ఏర్పాటు చేసిన కామాఖ్య క్లినిక్ ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు ప్రారంభించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో AMC చైర్మన్ మంజుల భాస్కర్, అధికారులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.