Trending News
Sunday, April 6, 2025
31.7 C
Hyderabad
Trending News

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ

గోపనపల్లి క్యాంపస్ లో కొత్త ఐటీ సెంటర్

5000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు

విప్రో కంపెనీ హైదరాబాద్లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లి లో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తో సమావేశమయ్యారు. అనంతరం ఈ కీలక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి. విప్రో క్యాంపస్ విస్తరణతో రాష్ట్రంలో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందనుంది. ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేండ్లలో పూర్తవుతుంది. ప్రభుత్వంతో విప్రో చేసుకున్న ఒప్పందంతో ప్రపంచ ఐటీ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతమవుతుంది. విప్రో విస్తరణ ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని ఈ సందర్భంగా విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆహ్వానించారు.

Latest News

వార రాశి ఫలాలు

ఏప్రిల్ 06 నుండి 12 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో మంచి...

రాష్ట్ర విభజన… తెలంగాణకు వరమైతే, భద్రాద్రి రామయ్యకు శాపం!?

భద్రాచలం.. భూలోక వైకుంఠం. సీతారాములు నడయాడిన నేల. తెలంగాణలో యాదగిరి గుట్ట, వేములవాడ రాజన్న తర్వాత అంతటి ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా నిలుస్తున్న క్షేత్రం. ప్రతీ ఏటా శ్రీరామ నవమి రోజున పాలకులు...

వల్మీడిలో అక్షింతలు పడ్డాకే, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం!

శ్రీ సీతారాములు నడయాడిందిక్కడే! రామాయణ కావ్యానికి బీజం పడిందిక్కడే!! వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి ఇదే!!! శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఏటా నవరాత్రోత్సవాలు ✍🏻డా.మార్గం లక్ష్మీనారాయణ వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో...

గుమ్మడి నర్సయ్య అందరికీ ఆదర్శం

గుమ్మడి నర్సయ్యకు జీవన సాఫల్య అవార్డు ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కమ్యూనిస్టు యోధుడు ఇల్లెంద మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం ఆయన త్యాగం పోరాటం నిరాడంబరత చిత్తశుద్ధి ప్రజలతోనే...

రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చితేనే బీసీ రిజర్వేషన్లకు రక్షణ

-రాజ్యాంగ నిపుణులు, తమిళ ఎంపీ విల్సన్ భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చితేనే బీసీలకు 42% రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, న్యాయవాది, తమిళనాడు ఎంపీ విల్సన్ అభిప్రాయ పడ్డారు....

సన్న బియ్యం మంచిగున్నాయా….

అమ్మా... ఎట్లూన్నావ్....నీకెంత మంది కొడుకులు, బిడ్డలు... నీకు పెన్షన్ వస్తుందా.... సన్న బియ్యం మంచిగున్నది కదా....అంటూ... మాదాపురం తండాలోని ఒక గిరిజన ఇంట్లో అక్కడ ఉన్న అవ్వతో... అంటూ.... స్థానిక ఎమ్మెల్యే యశస్విని...

హైదరాబాద్ కు నేడు మీనాక్షి

ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్.సి.ఏ భూముల అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ కమిటీతో ఆమె సమావేశం కానున్నారు. ఈ...

ఏప్రిల్ 05–2025 శనివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం శుక్లపక్షం తిధి అష్టమి రాత్రి12.28 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర ఉదయం 10.11 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ రాత్రి 11.03 వరకు ఉపరి సుకర్మ కరణం భద్ర పగలు 02.49 వరకు...

పురాణాలలో వెలుగొందిన సరస్వతీ నది చరిత్ర

పుష్కరాలకు సిద్ధమవుతున్న భక్తులు భారతదేశ చరిత్రలోనే కాక, పురాణాలలోను సరస్వతీ నది అపారమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. త్రివేణి సంగమంలో గంగ, యమునాలతో పాటు సరస్వతీ కూడా భాగమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ఈ నది...

కేంద్ర మంత్రులతో ఈటల రాజేందర్ సమావేశం

పలు కీలక అంశాలపై చర్చ ఢిల్లీ: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసింది. ఈ సందర్భంగా పలు సమస్యలు, ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రుల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News