దర్శనానికి తరలివస్తున్న లక్షలాది భక్తులు
సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మకరజ్యోతి దర్శనమిస్తుంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని చూడటం శుభప్రదంగా భక్తులు భావిస్తారు. ఈ జ్యోతి జీవితంలో సుఖ సంతోషాలు కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం భక్తుల ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది.