Cricket|క్రికెట్ ప్రపంచం సంతాపం
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ దుర్వార్తను జోస్ బట్లర్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్… థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్” అని పేర్కొంటూ, తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అలాగే, తండ్రితో కలిసి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న పాత ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అయితే, జాన్ బట్లర్ మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
తండ్రి మృతివార్త తెలిసిన అనంతరం అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జాన్ బట్లర్ ఆత్మకు శాంతి కలగాలని, జోస్ బట్లర్ కుటుంబానికి ధైర్యం కలగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ విషాద సమయంలో కూడా జోస్ బట్లర్ ది హండ్రెడ్ టోర్నీలో తన జట్టు మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున బరిలోకి దిగారు. తండ్రికి నివాళిగా జట్టు సభ్యులంతా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లు ధరించారు. మ్యాచ్‌లో జోస్ బట్లర్ నాలుగు బంతులు ఎదుర్కొన్నప్పటికీ ఖాతా తెరవకుండానే ఔటయ్యారు.
జాన్ బట్లర్ మృతివార్త క్రికెట్ ప్రపంచాన్ని బాధలోకి నెట్టింది. ఆటగాళ్లు, అభిమానులు, క్రికెట్ ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
https://x.com/CricCrazyJohns/status/1954817584580182094?t=RcTzWWLCJudrUtpz2fxYEA&s=19

