తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే హైకోర్టుకు తెలియజేసిన ప్రభుత్వం, అమలు విధానంపై ఉన్నతాధికారులతో సమాలోచనలు నిర్వహిస్తోంది. 2009లో దేశంలో అమలులోకి వచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం, ప్రీ ప్రైమరీ మరియు ఒకటో తరగతుల్లో 25% సీట్లు పేదల కోసం కేటాయించాల్సి ఉంటుంది. TGతో పాటు దేశంలోని మరో ఆరు రాష్ట్రాలు మాత్రమే ఇప్పటి వరకు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు.

