దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రాష్ట్రం మరో ప్రతిష్టాత్మక పెట్టుబడిని పొందింది. సన్ పెట్రోకెమికల్స్ సంస్థ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడులతో భారీ ప్రాజెక్టుల ఏర్పాటు పై ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, సన్ పెట్రోకెమికల్స్ సంస్థ తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.
ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు 7,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను అమలు చేస్తారు.
ఇప్పటివరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం సాధించిన అత్యంత పెద్ద ఒప్పందం ఇదే. రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నది.

