-వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా
మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్ నేరగాళ్ళు రోజు, రోజుకి కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొనేందుకు సైబర్ కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో పాటు పిరమిడ్ లాంటి స్కీంల ద్వారా ప్రజల నుండి డబ్బును దోచేస్తున్నారు. ఈ స్కీంల ప్రధాన లక్ష్యం విలాసవంతమైన వస్తువులు అందజేస్తామని, సొంత ఇంటి కలను నేరవేరుస్తామని, విదేశీ యాత్రలకు పంపిస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో ఈ స్కీంలను నిర్వహిస్తున్న సైబర్ నేరగాళ్లు మొదటగా కొంత రుసుముతో ప్రాథమిక సభ్యత్వాన్ని కల్పించడం జరుగుతుంది. సభ్యత్వం పొందిన వారితో మరికొంత మంది వ్యక్తులను సభ్యత్వం కల్పిచే ఎక్కువ మొత్తం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందని, ఎక్కువ మొత్తంలో సభ్యులను సభ్యులుగా చేర్పిస్తే పెద్ద మొత్తంగా డబ్బు వస్తుందని ప్రజలను మభ్యపెడుతూ కోట్లల్లో డబ్బు కొల్లగొట్టడం ఈ మల్టీ లెవెల్ స్కీంల ప్రధాన లక్ష్యమని ప్రజలు ముందుగా ఇది గుర్తించాలి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు ప్రజల ఆత్యాశను తమ ఆయుధాలుగా మార్చుకొని సామాజిక మాద్యమాలు, మెయిల్స్ ద్వారా, ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రజల బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రకటనల పట్ల ప్రజలు మోసపోవద్దని, ఇలాంటి స్కీం పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంటుందని, ఏవరైన ఇలాంటి స్కీంల ద్వారా మోసపోయినట్లుగా భావిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కుగాని లేదా https://www.cybercrime.gov.in అనే వెబ్‌సైట్‌లో కానీ లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సైబర్ నేరాల భారీన పడిన బాధితులు కమిషనరేట్ పరిధిలో సైబర్ సెక్యూరీటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లోనైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

