తిరుమల దర్శనాల్లో ప్రాధాన్యత లేకుండా పోతోందని తెలంగాణ ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన అసంతృప్తి నేపథ్యంలో సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ఎ నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, MLC, ఎంపీ ల సిఫార్సు లేఖలపై చర్చించారు. వారానికి నాలుగు సార్లు సిఫార్సు లేఖలను అనుమతిస్తూ సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. ఇందులో రెండు సార్లు బ్రేక్ దర్శనం, మరో రెండు సార్లు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోసం సిఫార్సు లేఖలకు అవకాశం కల్పించనున్నారు. తిరుమలలో తెలంగాణ భక్తులకూ సమాన ప్రాధాన్యం ఇచ్చే చర్యలు చేపట్టాలని సీఎం నిర్ధేశించారు.

