స్టేషన్ ఘనపూర్, డిసెంబర్ 21 (అడుగు న్యూస్): కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగంగా భేషరతు క్షమాపణలు చెప్పాలని లేదంటే ఆయనను మంత్రివర్గం నుంచి భర్త రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై బిజెపి, మోడీ వైఖరి, అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ, భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలపై స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. బహుజన ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ అక్కెనపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి, హిందూ ఎజెండా ను అమలు చేసే దురుద్దేశంతోనే అమిత్ షా అడ్డగోలుగా మాట్లాడారని అన్నారు. తన మాటలను వెనక్కి తీసుకొని, దేశ బహుజనులకు షా భేషరతుగా క్షమాపణ చెప్పాలి. మోడీ వైఖరి మారాలి. లేదంటే దేశంలో బహుజనులంతా ఏకమై, ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు ఐలపాక శ్రీనివాస్, నలిమెల ఎలియ, ప్రధాన కార్యదర్శి మారపాక వసంత్ కుమార్, ఇసాక్, చింతా జగదీష్, చాడ రాజ్ కుమార్, గడ్డ మీది సురేష్,
ఎ ఎం సి డైరెక్టర్ గాదెపాక బాబు, పోగుల సుధాకర్, పలువురు దళిత సంఘాల కార్యకర్తలు, బహుజనులు పాల్గొన్నారు. అమిత్ షా చిత్ర పటాన్ని దగ్ధం చేశారు.

