శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు పాల్గుణమాసం కృష్ణపక్షం
తిధి సప్తమి రాత్రి 11.45 వరకు ఉపరి
అష్టమి
నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 09.48 వరకు ఉపరి
మూల
యోగం సిద్ది పగలు 03.09 వరకు ఉపరి
వ్యతిపాత
కరణం భద్ర ఉదయం 11.07 వరకు ఉపరి
బాలవ
వర్జ్యం వర్జ్యం లేదు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.12 వరకు
రాహుకాలం ఉదయం 10.30 నుండి
12.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.25
సూర్యాస్తమయం సాయంత్రం 06.24
మార్చి 21, 2025 రాశి ఫలాలు
మేషరాశి
ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. లక్ష్య సాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు. మీ ప్రణాళికలు, వ్యూహాలు ఫలిస్తాయి. అయితే, మానసిక సంఘర్షణ తీరదు.
వృషభరాశి
స్వయంకృతాపరాదాలు చోటు చేసుకుంటాయి. న్యాయవాదులతో చర్చలు సాగిస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా చేసే చిన్నపాటి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
మిథునరాశి
ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు. స్నేహితులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి ముందు ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోండి.
కర్కాటకరాశి
జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ రంగాల నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.
సింహరాశి
ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు కొత్త సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
కన్యరాశి
సాయంత్రం స్నేహితులతో వ్యాపార ప్రణాళికలపై చర్చిస్తారు. మత్తుపానీయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వ్యక్తులను బాధ పెట్టకండి;
తులరాశి
బయటి ఆహారాన్ని తినకపోవడం మంచిది, లేకపోతే పొట్ట సమస్యలు ఎదుర్కోవచ్చు. సాయంత్రం స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు, కానీ ఖర్చులు అదుపులో పెట్టుకోండి.
వృశ్చికరాశి
అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో వారితో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు రాశి
ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యంపై నిర్లక్ష్యం తలనొప్పి, జ్వరం వంటి సమస్యలకు దారి తీస్తుంది. పనితో పాటు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోండి.
మకరరాశి
మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. చుట్టూ ఉన్న వ్యక్తులు దీనిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.
కుంభరాశి
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాలలో సంతోషంగా, మరికొన్ని విషయాలలో నిరాశ చెందవచ్చు. వృత్తిపరంగా, కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. పనిలో మరింత కష్టపడాలి.
మీనరాశి
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తిపరంగా, పనిలో విజయం సాధిస్తారు.

