శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-కృష్ణపక్షం
తిధి బ ద్వాదశి ఉదయం 10.35 వరకు
ఉపరి త్రయోదశి
నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.10
వరకు ఉపరి శ్రవణ
యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.54
వరకు ఉపరి పరిఘ
కరణం తైతుల ఉదయం 10.07 వరకు
ఉపరి వనజీ
వర్జ్యం రాత్రి 09.01 నుండి 10.35
వరకు
దుర్ముహూర్తం పగలు 08.24 నుండి
09.12 వరకు పునః రాత్రి 10.48 నుండి
11.36 వరకు
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.40
సూర్యాస్తమయం సాయంత్రం 06.05
ఫిబ్రవరి 25 మంగళవారం 2025
రాశి ఫలితాలు
మేష
ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్యాలను చేరుకుంటారు, ఆత్మవిశ్వాసం విజయం సాధించేందుకు దోహదపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృషభ
సామాన్య దినం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సుదూర ప్రయాణాలు సంభవం. నిర్ణయాల్లో స్థిరత్వం లేకపోవచ్చు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబంతో తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.
మిథున
మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాలవారు తమ రంగాల్లో శుభఫలితాలు పొందుతారు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు, అసైన్మెంట్లు వాయిదా వేయడం మంచిది. ఖర్చులను నియంత్రించండి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.
కర్కాటక
ఫలవంతమైన రోజు. స్నేహితులు, ప్రియమైనవారితో సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిపరంగా, ఆర్థికంగా లాభాలు పొందుతారు. వ్యాపారంలో భాగస్వాముల నుంచి ప్రయోజనం ఉంటుంది. సమాజంలో గౌరవం పొందుతారు.
సింహ
సామాన్య దినం. కుటుంబంలో ఉద్రిక్తతలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులను నియంత్రించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
కన్య
మిశ్రమ ఫలితాలు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి.
తుల
అనుకూల దినం. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. ఆశయాలు నెరవేరుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆస్తి సంబంధిత డాక్యుమెంట్లలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అవమానకర పరిస్థితులకు దూరంగా ఉండండి.
వృశ్చిక
ఆనందకరమైన రోజు. నూతన భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అన్ని రంగాలవారు తమ రంగాల్లో సత్వర విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధి సంబంధిత శుభవార్తలు వింటారు. ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించండి. ఆర్థికంగా శుభసమయం.
ధనుస్సు
అనుకూల దినం. ఆశించిన ఫలితాలు పొందుతారు. కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆశీస్సులు అండగా ఉంటాయి. బుద్ధిబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. సన్నిహితులతో విహారయాత్రలు చేస్తారు.
మకర
శుభప్రదమైన రోజు. మనోధైర్యంతో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు. ప్రయత్నాలు, బాధ్యతలు ఫలిస్తాయి. పరపతి పెరుగుతుంది. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు.
కుంభ
మిశ్రమ ఫలితాలు. చేపట్టిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రతిభతో విజయాలు సాధిస్తారు. కోపాన్ని నియంత్రించండి, లేకపోతే కలహాలు సంభవించవచ్చు. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఖర్చులు ఆదాయాన్ని మించవచ్చు.
మీన
కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఓపికపట్టడం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యమైనది. తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక శక్తులు మరియు సహనాన్ని పెంపొందించడం ద్వారా ఈ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

