శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-కృష్ణపక్షం
తిధి బ.షష్ఠి రాత్రి తెల్ల 04.53 వరకు
ఉపరి సప్తమి
నక్షత్రం చిత్త ఉదయం 07.52 వరకు
ఉపరి స్వాతి
యోగం గండ ఉదయం 08.09 వరకు
ఉపరి వృద్ధి
కరణం గరజి పగలు 03.29 వరకు ఉపరి
భద్ర
వర్జ్యం పగలు 02.06 నుండి 03.51
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి రాత్రి 10.48 నుండి
11.36 వరకు
రాహుకాలం పగలు 03.00 నుండి
04.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.42
సూర్యాస్తమయం సాయంత్రం 06.19
ఫిబ్రవరి 18 మంగళవారం 2025
రాశి ఫలితాలు
మేష రాశి: ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవచ్చు, విశ్రాంతి తీసుకోండి. కుటుంబంలో చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిది.
వృషభ రాశి: వృత్తి, వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రముఖులతో సమావేశాలు జరుగుతాయి. స్త్రీలకు అలంకార వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి.
మిథున రాశి: ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. జీవిత భాగస్వామి సలహా పాటించడం మంచిది. పత్రాలు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. నిరుద్యోగులు స్వయం ఉపాధి అవకాశాలను పరిశీలించండి.
కర్కాటక రాశి: కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. కుటుంబ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ధన వ్యయంపై నియంత్రణ అవసరం. సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనండి.
సింహ రాశి: ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
కన్యా రాశి: నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. స్త్రీల కోరికలు నెరవేరతాయి. దూర ప్రయాణాల్లో ఒత్తిడి ఎదుర్కొనవచ్చు.
తులా రాశి: పనులు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది.
వృశ్చిక రాశి: రాజకీయ నాయకులు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. స్త్రీలు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. సంతానంపై శ్రద్ధ వహించండి.
ధనుస్సు రాశి: నిరుద్యోగులు ఇంటర్వ్యూలో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు కుటుంబంలో చికాకులు ఉండవచ్చు. రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.
మకర రాశి: భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. స్త్రీలు గృహ ఉపకరణాలపై ఆసక్తి చూపుతారు. పాత మిత్రులతో కలయిక ఉంటుంది.
కుంభ రాశి: పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. అలవాట్లపై నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు విసుగు కలిగించవచ్చు. రుణాలు తీర్చడం సాధ్యమవుతుంది.
మీన రాశి: చిరు వ్యాపారులకు లాభాలు ఉంటాయి. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో విభేదాలు ఎదుర్కొనవచ్చు. వాణిజ్య ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించండి.

