
అన్నం పరబహ్మ స్వరూపమన్నరు గద! గందుకేనేమో, గా మహారాష్ట్ర పూణేల ఉన్న ఓ రెస్టారెంట్ వోటల్ ల బువ్వ, కూరలు వదిలిపెడితే ఫైన్ కట్టాల్నట. గీ ముచ్చటను గా ఓటల్ మెనూ బోర్డు మీదనే బాజాప్తా రాసి పెట్టిండ్రు. గిది సూసిన ఓగామె ఎక్స్ నెట్టింట్ల పోస్టు పెట్టింది. గది సూసినోల్లల్ల ఓకాయనె గిదేదో బాగుందంటే… కంటికి, నాల్కకు నచ్చంది ఎట్ల తింటం బయ్? అన్నడట ఇంకొయానె. సరె గనీ, అన్ని ఇండ్లల్ల, ఓటల్లల్ల, పెండ్లిల్లల్ల గూడ గీ రూల్ పెడితే ఎట్లుంటది? జెర సోచాయించుండ్రి.

