ముగిసిన సృజనాత్మక, ప్రగతిశీల మహా ప్రస్థానం
ఉద్యమాలే ఊపిరిగా, JOB|ఉద్యోగం ఆసరగా ప్రయాణం
AIR|ఎఐఆర్, PLANNING COMMISSION|ప్లానింగ్ కమిషన్, ప్రచారశాఖల్లో తనదైన ముద్ర
IIS|ఐఐఎస్ కి రాజీనామా చేసి TELANGANA|తెలంగాణ ఉద్యమంలోకి
బహుజనుల హక్కుల కోసమే బతుకంతా పోరాటం
‘మేమెంతో…మాకంత వాటా’ కోసం ఆరాటం
కాకతీయలో JOURNALISM|జర్నలిజం శాఖకు పురుడుపోసింది ప్రభంజనే
తెలంగాణ వర్సిటీలో ఆచార్యుడిగా అనేక అంతర్జాతీ సెమినార్లు
విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త, రచయిత, జర్నలిస్టు…
గూడూరులో ఆయన అభిమానులు, శిష్యులు, కుటుంబ సభ్యులతో అంతిమ యాత్ర
పార్థీవ దేహం JANGAON MEDICAL COLLEGE|జనగామ మెడికల్ కాలేజీకి అప్పగింత
EX CM|మాజీ సీఎం KCR|కేసీఆర్, VENNELA GADDAR|వెన్నెల గద్దర్ సహా పలువురి నివాళులు, సంతాపం
పాలకుర్తి/జనగామ, జూలై 16(అడుగు ప్రత్యేక ప్రతినిధి):
హైదరాబాద్, తన నివాసంలో తీవ్ర అనారోగ్యంతో అకాల మరణం చెందిన ప్రముఖ సామాజిక, బహుజన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు, విద్యావేత్త, సామాజిక శాస్త్రవేత్త, జర్నలిజం ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ దేహాన్ని ఆయన కోరిక మేరకు జనగామ జిల్లా మెడికల్ కాలేజీకి అందించారు. హైదరాబాద్ తన నివాసంలో ఉదయం 06:00 గంటల ప్రాంతంలో కన్నుమూసిన వెంటనే ఆయన భార్య డా.రేఖ, ఆయన సోదరులు రమేష్, శ్రీనివాస్, వీరస్వామి, దగ్గరి బంధువు కొంగరి నాంపల్లి, బావలు రవీంద్ర, బద్రి, రాంచందర్, రాజయ్య తదితరులు అంబులెన్స్ ద్వారా మధ్యాహ్నం 12:00 గంటలకు ఆయన స్వగ్రామం జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరులోని ఆయన ఇంటికి చేర్చారు. అక్కడే తాను స్థాపించిన సత్యశోధక పీఠం పాఠశాల ప్రాంగణంలో ప్రజల సందర్శనార్థం ఉంచగా, గ్రామస్థులు, పుర ప్రముఖులు, మిత్రులు, శిష్యులు తదితరులు సందర్శించారు. కాగా, మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమైన అంతిమ యాత్ర, గ్రామ చౌరస్తా గుండా… ఊరి పొలిమేరకు చేర్చి, సాయంత్రం 04:30 గంటల ప్రాంతంలో మిత్రులు, శిష్యుల అమర్ రహే ప్రభంజన్ యాదవ్ అమర్ రహే అంటూ.., వారి నినాదాల మధ్య ఆయన దేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోగ నిమిత్తం జనగామ మెడికల్ కాలేజీకి అప్పగించారు.


ప్రభంజన ప్రస్థానం:
జనగామ జిల్లా (పూర్వం వరంగల్ జిల్లా), పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఒక సామాన్య గొర్రెల కాపరి యాదవ కుటుంబంలో యాదనాల కొమరమ్మ, సోమయ్య దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన డాక్టర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ మొట్ట మొదటి సారిగా గ్రామం నుండి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సాధించారు. ఆల్ ఇండియా రేడియోలో విధులు నిర్వహించారు. తర్వాత న్యూ డిల్లీ జాతీయ ప్లానింగ్ కమిషన్ లో పీఆర్ఓ గా విధులు నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. విద్యార్థి దశ నుండే ప్రగతిశీల వామపక్ష భావజాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తూ డోలు దెబ్బ, యాదవ ఇంటలెక్చువల్ ఫోరం, సామాజిక తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి నిరంతరం ప్రజలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పని చేశారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య చిత్రాన్ని మొట్టమొదటగా చేయించిన వ్యక్తి ఆయన. సత్యశోధక సామాజిక విద్యాపీఠం స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించారు. జానపదాలను జననాట్య మండలి ఉద్యమ కళారూపాలుగా వాడుకున్న వైనం మీద తన ఎంఫీల్ థీసిస్ ప్రజెంట్ చేశారు. దాని గురించి గద్దర్ తో పాటు అజ్ఞాత కళకారులు సంజీవ్, దివాకర్, రమేష్, ఈవి, పద్మ, కుమారి తదిరుల కృషి మీద పరిశోథన చేసి ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్’గా వెలుగులోకి తెచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీఎస్పీ పార్టీ జనరల్ సెక్రటరీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమ సంఘాలతో కలిసి పని చేశారు. ఆ తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్ గా తన సేవలను కొనసాగించి పదవీ విరమణ పొందారు. వీరి కృషి వల్లే కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం శాఖ మొదలైంది.


తరలివచ్చిన ప్రముఖులు:
ప్రజా యుద్ధ నౌక, గద్దర్ బిడ్డ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ నాయకుడు చెరుకు సుధాకర్, సోమనాథ కళా పీఠం అధ్యక్షులు డా.రాపోలు సత్యనారాయణ, హిందూ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్, సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్, కన్నా పరుశరాములు, చాపర్తి కుమార్ గడ్గే, న్యాయవాది కదిరే కృష్ణ, కొంగర నరహరి, అమరేందర్, అశోక్ బాబు, కోలా జనార్ధన్, మల్లేష్, గుమ్మడిరాజుల సాంబయ్య, పాలకుర్తి దేవస్థాన మాజీ చైర్మెన్ చిలువేరు కృష్ణమూర్తి, సంగి వెంకన్న, పులి గణేష్, మాచర్ల సారయ్య, వైట్ల లక్ష్మీపతి, క్లాస్ మేట్ సింగారపు దీపక్, మాజీ సర్పంచులు బక్కి పుల్లయ్య, మంద కొమురయ్య, మాచర్ల పుల్లయ్య, సలేంద్ర శ్రీనివాస్, కత్తుల రామ్ చందర్ యాదవ్, కత్తుల యాకయ్య, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి డాక్టర్ భీష్మాచారి తడుతరులు, అడుగు డిజిటల్ మీడియా, చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ తరుపున మార్గం సాయి సందీప్ తేజ తదితరులు ఘన నివాళులు అర్పించారు.


మెడికల్ కాలేజీకి పార్థవదేహం అప్పగింత:
సామాజిక ఉద్యమకారుడిగా తెలంగాణ జన సేన స్థాపించి సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా అహర్నిశలు పరితపించిన ప్రభంజన్, మండల్ టీవీ ని స్థాపించి చివరి వరకు ఉద్యమిస్తూ తుది శ్వాస వరకు సామాజిక న్యాయం కోసం పని చేశారు. ‘మేం ఎంతో మాకు అంత వాటా’ నినాదంతో బహుజన ఉద్యమాన్ని నడిపిస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించి, బహుజన మీడియా, ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ లాంటి ఎన్నో పుస్తకాలను రచించి బతికున్నంత కాలం విద్యార్థులకు, సమాజానికి ఉపయోగపడినట్లే తన మరణానంతరం కూడా వైద్య విద్యార్థులకు తన శరీరం ఉపయోగపడాలనే సామాజిక స్పూర్తితో చివరగా తన భౌతిక దేహాన్ని సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కి సమర్పించారు.


పలువురు సంతాపం:
ప్రభంజన్ యాదవ్ మృతి పట్ల మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, కవులు రచయితలు సుద్దాల అశోక్ తేజ, గద్దర్ కుమారుడు సూర్యం, క్రాంతిదళ్ పృథ్వీ, సంగిశెట్టి శ్రీనివాస్, వనపట్ల సుబ్బయ్య, పల్లా సుందర్ రామ్ రెడ్డి, తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.


