CM| సీఎం SAVAL| సవాల్ పై BRS|బీఆర్ఎస్ SILENCE|సైలెన్స్
హైదరాబాద్, జులై 11 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
సాధారణంగా సవాల్ విసిరి ఎదుటి పార్టీని సైలెంట్ చేయడంలో ‘నోరు’ తిరిగిన బీఆర్ఎస్ పార్టీలో అనూహ్యమైన సైలెన్స్ నెలకొంది. ‘కేసీఆర్ |KCR| గారూ మీరు ASSEMBLY| అసెంబ్లీకి రండి లేకపోతే నేనే మీ ఎర్రవెల్లి ఫాం హౌస్ కి వస్తా’నన్న సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి సవాల్ తో గులాబీ పార్టీలో అంతా గప్ చుప్ గా మారిపోయింది. ప్రధాని మోడీకి, మాజీ సీఎం కేసీఆర్ కి సీఎం సవాల్ విసిరితే, ‘కేసీఆర్ దాకా ఎందుకు నీకు నేనే చాలు!’ అంటూ ప్రెస్ క్లబ్ లో ‘చర్చకు రమ్మంటే సీఎం ఢిల్లీకి పారిపోయాడని’ చేసిన హడావుడికి అనూహ్యంగా సీఎం స్పందించారు. అయితే అసెంబ్లీలో చర్చిద్దాం. కాదంటే మీరు రానంటే నేనే మీ ఫాం హౌస్ కి వస్తానని సీఎం సవాల్ విసరడంతో ఒక్కసారిగా కేసీఆర్ ఫ్యామిలీలోనే కాదు, బీఆర్ఎస్ లోనూ ఎవరూ ఇక ఆ విషయమే ఎత్తడం లేదు. గత రెండు రోజులుగా.. గులాబీ బాస్ వైద్యశాలకు చెకప్ కోసం వెళ్ళగా, చిన్న బాస్ చికిత్స తీసుకుంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళారు. మిగతా వారెవ్వరూ సీఎం సవాల్ ఊసే ఎత్తకుండా గప్ చుప్ గా ఉండిపోయారు. ఈలోగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదించి, ఆర్డినెన్స్ కు హామీ ఇవ్వడంతో సవాళ్ళు, ప్రతి సవాళ్ళ రచ్చ పక్కకుపోయి, రిజర్వేషన్ల లొల్లి ముందుకు వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలోనూ బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు రావడం, గులాబీలు రెండు కూతలెత్తుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది. ముక్త కంఠంతో పార్టీ వ్యతిరేకిస్తున్నదని పార్టీ పక్షాన శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రకటించగా, తమ ఒత్తిడి వల్లే వచ్చిన బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తున్నామని గులాబీ బాస్ కూతురు, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కవిత చెప్పడం, రైల్ రోకోని నిరవధికంగా రద్దు చేయడం ఆపార్టీ గందరగోళాన్ని ఎత్తిచూపినట్లయింది. అయితే, సీఎం సవాల్ ని బీఆర్ఎస్ స్వీకరించిందా? లేక నిరసించిందా? మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వెళుతున్నారా? లేక సీఎం రేవంత్ రెడ్డిని లేదా మంత్రులను తన ఫాం హౌస్ కి రమ్మంటున్నారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే, సీరియస్ గా మాజీ సీఎం ఫాం హౌస్ కే వెళతానన్న సీఎం రేవంత్ రెడ్డి తన సవాల్ ని వెనక్కి తీసుకుంటారా? ముందుకే వెళతారా?

