Trending News
Sunday, December 7, 2025
17.2 C
Hyderabad
Trending News

నన్నెవరూ Gandhibhavan|గాంధీ భవన్‌కు పిలవలేదు…

గాంధీ భవన్ లో Konda Murali|కొండా మురళీ |Warangal

TELANGANA| తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంతర్గత గందరగోళం సాగుతోంది. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి శనివారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇందుకోసం ఆయన గాంధీ భవన్‌కు రాగా, పార్టీ అధిష్ఠానం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. MALLU RAVI| మల్లు రవి నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీకి ఆయన పూర్తి స్థాయిలో తన వాదనలు వినిపించారు. మాట్లాడాల్సిన అంశాలు స్వయంగా చెప్పారు. కొన్నింటిని వాయిస్ ద్వారా, మరికొన్నింటిని వ్రాతపూర్వకంగా వినతి పత్రాల రూపంలో సమర్పించారు.

గాంధీ భవన్‌కు తనను ఎవ్వరూ ఆహ్వానించకపోయినా, పార్టీపై, TPCC CHIEF| పీసీసీ చీఫ్ MAHESH KUMAR GOUD| మహేష్ కుమార్ గౌడ్‌పై అభిమానంతోనే వచ్చానని కొండా మురళి స్పష్టం చేశారు. పార్టీ కమిటీ ఎదుట తనపై ఎలాంటి ప్రశ్నలు రాకపోయినా, తానే స్వయంగా ఆరోపణలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తాను బద్ధమైన వర్గస్థుడినని, బీసీల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. తనను బెదిరించే ప్రయత్నాలు చేయొద్దని, చావుకే భయపడని వ్యక్తినని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మురళి, పార్టీకి తాను చేస్తున్న సేవలను గుర్తుచేశారు. గతంలో బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తాను, తన భార్య KONDA SUREKHA| కొండా సురేఖ ఇద్దరూ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి వచ్చామని అన్నారు. ఇదే సమయంలో పార్టీలోకి వచ్చి పదవులను ఆస్వాదిస్తూ, రాజీనామా చేయని KADIYAM SRIHARI| కడియం శ్రీహరి వివాదాస్పద పాత్ర పోషిస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోకి ఆయన వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయని, వరంగల్ జిల్లాలో శాంతిని దెబ్బతీసే విధంగా పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సురేఖ, సీతక్కల మధ్య తప్పుడు ప్రచారాలతో విభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

PARKAL| పరకాల నియోజకవర్గం తమదేనని స్పష్టం చేసిన మురళి, REVURI PRAKASH REDDY|రేవూరి ప్రకాష్ రెడ్డిని తాము గెలిపించామన్నారు. తాము నిస్వార్ధంగా మద్దతు ఇచ్చినా, ఇప్పుడు రేవూరి మరిచిపోయి గుడుపుటాని రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. NAINI RAJENDER REDDY| నాయిని రాజేందర్ రెడ్డి తనకు సంబంధం లేని నియోజకవర్గాల్లోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వ పోస్టులను సంపాదించుకుంటున్నాడని ఆరోపించారు. ఈ తరహా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మచ్చ తేల్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇక స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇందిర అనుచరులపై కడియం శ్రీహరి టార్చర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరకు రాజకీయంగా ఎదురుదెబ్బ ఇచ్చేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. VEM NARENDER REDDY| వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిని కోల్పోయిన ఘటనకు తానే కారణమన్న కోపంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. కానీ తాను పార్టీ మారిన సమయంలో అన్ని నిబంధనలకు కట్టుబడి, నియమానుసారం రాజీనామా చేసి వచ్చినట్లు గుర్తు చేశారు. తనతో పాటు 26 మంది కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ గూటికి తెచ్చిన ఘనత తనదేనని చెప్పారు.

ఇంత జరుగుతున్నా, పార్టీ నాయకత్వంపై గౌరవం ఉంచుతున్నానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లపై నమ్మకం ఉందని తెలిపారు. వారి పాత్రను పక్కదారి పట్టించే ప్రయత్నాలు విఫలమవుతాయని హెచ్చరించారు. పార్టీ పెద్దలు సమస్యలను సీరియస్‌గా తీసుకుని పరిష్కారం చేయాలని సూచించారు.

ఇక మల్లు రవికి ఇచ్చిన లేఖలోనూ కొండా మురళి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మంత్రి PONGULETI SRINIVAS REDDY| పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేఖ మంత్రిత్వ పదవికి భంగం కలిగించేందుకు కడియం విష ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. రేవూరి, గండ్రలు తమ మద్దతుతో గెలిచి ఇప్పుడు వ్యతిరేక శిబిరంగా మారారని తెలిపారు.

మొత్తంగా, కాంగ్రెస్‌లోనూ ప్రాంతీయ ఆధిపత్య పోరాటాలు, విభేదాలు పార్టీకి ప్రధాన సమస్యలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా మురళి లేఖపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలే కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే ఈ వ్యవహారం, రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Latest News

కూరలకెలి నూనె తీసుడింత అలకనా?!|ADUGU TRENDS

యెనకటికి ఆయాల్, సాయాల్, ఎచ్చాలు కలిపి, గింత, కారం, ఉప్పేసి, కాపిశికెడంత నూనెపోసి ఉడుకబెడితే కమ్మగ, లొట్టలేసుకుంట తినేది. ఇగిప్పుడు గంటెలు గంటెలు నూనెలు పోసి, గా నూనెల్నె ఉడికిచ్చుడు, ఏంచుడైపోయె. ఎంత...

నామినేషన్ కోసం భిక్షాటన|PANCHAYATI TRENDS

కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన బానోత్ బద్రి తన నామినేషన్ ఖర్చుల కోసం శుక్రవారం పంచాయతీ పరిధిలో భిక్షాటన చేపట్టడం చర్చనీయాంశమైంది. దుబ్బతండాకు...

ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా కోతులు!|EDITORIAL

మానవులు కోతి నుంచే ఉద్భవించారని ప్రతీతి. దగ్గరి పోలికలుండటం వల్లనేమో అలా అని ఉంటారు. కోతి నుంచే మానవుడు ఉద్భవించే ఉంటే, పరిణామక్రమంలో కోతులుండ కూడదు కదా! కోతులు ఇంకా ఉన్నాయంటే, అవి...

శనివారం డిసెంబర్ 06–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.విదియ రాత్రి 12.50 వరకు ఉపరి తదియ నక్షత్రం మృగశిర ఉదయం 11.53 వరకు ఉపరి ఆరుద్ర యోగం శుభ రాత్రి 02.25 వరకు ఉపరి శుక్ల కరణం తైతుల పగలు...

శుక్రవారం డిసెంబర్ 05–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--కృష్ణ పక్షం తిధి బ.పాడ్యమి రాత్రి తెల్ల 02.59 వరకు ఉపరి విదియ నక్షత్రం రోహిణి పగలు 01.30 వరకు ఉపరి మృగశిర యోగం సిద్ద ఉదయం 08.31 వరకు ఉపరి సాధ్య కరణం బవ...

వార్డు మెంబర్ గెలిపిస్తే సూపర్ ఆఫర్‌|PANCHAYATI TRENDS

స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్...

‘కాకిపిల్ల కాకికే ముద్దు!’|ADUGU TRENDS

నిజమే గద. పిల్లెట్లున్నా, కాకికి ముద్దే గదా? గట్ల కాకికే కాదుల్లా.. ఏ పచ్చికైనా గంతేనుల్లా.. కాకుండే గిదీన్ని సూడుండ్రి. ఒకాయినె ట్రాక్టర్ తోటి శెలక దున్నుతాండు. దున్నుకుంట దున్నుకుంట వత్తాంటే, పురుగుల కోసం...

సర్కార్లకి సవాల్ గా గంజాయి మాఫియా!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టుగా సాగే చీకటి వ్యాపారం గట్టు తెగించింది. తాజాగా నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా గ్యాంగ్‌ దాడిలో కొట్టాచిట్టం పెంచలయ్య దారుణ హత్యకు గురవడం...

గురువారం డిసెంబర్ 04–2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు మార్గశిర మాసం--శుక్లపక్షం దత్తాత్రేయ జయంతి తిధి శు.చతుర్దశి ఉదయం 07.37 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం కృత్తిక పగలు 03.12 వరకు ఉపరి రోహిణి యోగం శివ ఉదయం 11.45 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

భౌ భౌ…! భౌ భౌ…భౌ!!|DOGS|INDIA|SUPREME COURT

విచ్చలవిడిగా విస్తరిస్తోన్న వీధి కుక్కలు రెచ్చిపోతున్న పిచ్చి కుక్కలు కరచి, రక్కి, కొరికి పారేస్తున్న శునకాలు నియంత్రణకు ‘సుప్రీం’ ఆదేశాలు సాదుకునే రోజుల నుంచి... కుక్కలంటే భయపడే రోజులొచ్చాయ్ కుక్కకు కూడా ఓ రోజొస్తుందంటే ఏమో అనుకున్నాం! నిజంగానే...

ఒకే కుటుంబం నుంచి ఐదుగురు సర్పంచ్ పోటీదారులే|PANCHAYATI TRENDS

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ ఈ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన ఈ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒకే కుటుంబానికి చెందిన...

గిదేం ఇచ్చెంత్రం!?|ADUGU TRENDS

‘నీల్లు పల్లమెరుగు.. నిజం దేవుడెరుగు!’ అన్నరు. నిజం సంగతేమో గనీ, నీల్లయితే పల్లానికే పోతయి గదా! నిజమా? కాదా? కనీ, ఓ దగ్గర మాత్రం నీల్లు మిట్టకు పోతున్నయుల్లా!? గిదైతే నిజమో, అబద్దమో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News