Hyderabad| హైదరాబాద్ Jawahar Nagar| జవహర్‌నగర్‌లో T NEWS| టీ న్యూస్ చానల్‌లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. రామ్‌నగర్‌లో తల్లి శ్రీదేవితో కలిసి నివాసం ఉండే ఆమె, ఇటీవల కొన్ని వ్యక్తిగత కారణాలతో మానసికంగా కుంగిపోయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్వేచ్చ మృతి పట్ల ఆమె సహచరులు, స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ధైర్యంగా ఉండే స్వేచ్ఛ ఆత్మహత్య ఎలా చేసుకుంది అని ఆమె స్నేహితులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

