RAITHU BHAROSA| రైతు భరోసా సభలో CM| సీఎం రేవంత్ రెడ్డి |REVANTH REDDY గర్జన
TELANGANA| తెలంగాణ రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. SECRETERIAT| సచివాలయం సాక్షిగా STATE| రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు పండుగ చేసుకుంటున్న రోజు ఇదని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినట్టు గుర్తుచేశారు. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే పోరాటాలు, త్యాగాలు జరిగాయని, సొంత ఊరు, భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూస్తామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంలో రైతులకు మొదటి ప్రాధాన్యత ఆ తరువాతే ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో FARMERS| రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.7625 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. ఎన్నికల హామీ మేరకు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీని ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు.
AUGUST| ఆగస్టు 15, 2024 నాటికి రైతులను రుణ విముక్తులుగా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చెప్పారు. గతంలో వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని కేసీఆర్ చెప్పారని గుర్తుచేసి, ప్రజా ప్రభుత్వం వచ్చాక వరి పండించండి, మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. రైతులకు మన ప్రభుత్వంపై నమ్మకం ఉండటం వల్లే దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని అన్నారు. 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలో మొదటి స్థానాన్ని తెలంగాణ దక్కించుకుందన్నారు.
దళారుల దోపిడీని అడ్డుకున్న GOVERNMENT| ప్రభుత్వం తమదేనని, మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ |BONUS ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గర్వంగా చెప్పారు. KCR| కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడినట్లు వదిలేశారని, మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడని, రైతులకేమి చేశారని వారు ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కోకాపేటలో భూములు అమ్మి రైతు భరోసా, ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మి రుణమాఫీ చేయాలన్న బలహీనతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
KALESHWARAM| కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న KCR| కేసీఆర్ ప్రభుత్వం రైతుల ముసుగులో వేల కోట్లు సంపాదించిందని, MOINABAD| మొయినాబాద్, JANWADA| జన్వాడ, GAJWEL| గజ్వేల్‌లలో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల దగ్గర 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పదేళ్లలో వాళ్ళు ధనవంతులయ్యారు.. కానీ ధనిక తెలంగాణను దివాళా రాష్ట్రంగా మార్చారన్నారు.
తమ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మొత్తం 1 లక్షా 4 వేల కోట్లను 18 నెలల్లో రైతుల కోసం ఖర్చు చేసిందని వివరించారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ప్రజా పాలన తమదేనని అన్నారు. కేసీఆర్‌తో OPEN DEBATE| ఓపెన్ డిబేట్ కు సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు. మీరు లక్ష కోట్లు కొల్లగొడితే, మేము రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
WOMENS| మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తూ పదేళ్ల పాలన, 18 నెలల పాలనను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో చెప్పాలన్నారు.
దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే 4 వేల ఎకరాల సాగు జరిగేదని, కానీ కేసీఆర్ పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులపై ఉదాసీనంగా వ్యవహరించారని, లక్ష కోట్లు దోచుకుని ఇప్పుడు బనకచర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు చంద్రబాబు అవసరమైతే అక్కడే ఉండేవాణ్ణి.. కానీ సోనియమ్మ ఆశయాలతో కాంగ్రెస్‌లో చేరాను అన్నారు.
GODAVARI| గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చకు సిద్ధమని, స్పీకర్‌కు లేఖ రాసి చర్చ పెట్టాలంటూ కేసీఆర్‌ను సూటిగా సవాలు చేశారు. తాము నిజాయితీతో రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నామని, సాగునీటి న్యాయం కోసం నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు.

