KONDA MURALI| కొండా మురళికి ESCORT| ఎస్కార్ట్ వెళ్లిన ACP| ఏసీపీ, INSPECTOR| ఇన్స్పెక్టర్లకు MEMO|మెమోలు
WARANGAL EAST CONSTITUENCY| వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత, రాష్ట్ర MINISTER| మంత్రి KONDA SUREKHA| కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావుకు ఎస్కార్ట్‌గా పోలీసులు వెళ్లిన వ్యవహారంపై WARANGAL| వరంగల్ POLICE COMMISSIONER| పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు పోలీసు అధికారులకు ఆయన మెమోలు జారీ చేశారు. అధికారిక ప్రొటోకాల్ లేని వ్యక్తికి పోలీసులు బందోబస్తు ఇవ్వడం వల్ల పోలీస్ శాఖ పరువు తీసినట్లేనని వారితో అన్నట్లు తెలిసింది.
ఈ మేరకు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్‌తో పాటు మిల్స్ కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌ల ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, ఎస్సైలకు సీపీ మెమోలు జారీ చేశారు. వారంతా శనివారం విధులను వదిలి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వెంట ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ ద్వారా విచారణ చేపట్టి నివేదిక సేకరించిన సీపీ, చర్యలకు శ్రీకారం చుట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన తీరుపై మెమోలు తీసుకున్న అధికారులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశమున్నదని మెమోలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రమైన వ్యతిరేకత కన్పిస్తుంది. పోలీసులను వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం వినియోగించడం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది. కొండా మురళికి ఎస్కార్ట్ ఇవ్వడమే కాకుండా, గతంలోనూ ఇలాగే పలుమార్లు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం కూడా కొండా మురళీతో పాటు మంత్రి సురేఖ హాజరైన ఓ ఫంక్షన్‌కు హనుమకొండ హంటర్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌కి పోలీసుల ఎస్కార్ట్ వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంలో సుబేదారి పోలీసులే కాకుండా, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ ఇన్‌స్పెక్టర్లు కూడా హనుమకొండ రాంనగర్లోని కొండా నివాసం నుంచి ఫంక్షన్ హాల్‌కి ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు సమాచారం.
ఇలాంటి ఘటనలతో సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందడంలో ఆటంకం ఏర్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధులను వదిలి ప్రొటోకాల్ లేని వ్యక్తులకోసం వెళ్లడం వల్ల ప్రజలకు నష్టమే జరిగిందని, పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చేనని భావిస్తున్నారు. ఈ మెమోల జారీతోనైనా అధికారులు మారతారా? లేదా? అనేది చూడాలి.

