ENQUIRY| విచారణలో BRS| బీఆర్ఎస్ కుట్రను బహిర్గతం చేసినట్లు ప్రకటన
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన Phone Tapping| ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక రాజకీయ కుట్రగా అట్టడుగు నుంచి అమలైందని టీపీసీసీ అధ్యక్షుడు, MLC| ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ |MAHESH KUMAR GOUD అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ లాంటి హేయమైన, ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు అప్పటి ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా పాల్పడింది. 650 మందికి పైగా CONGRESS| కాంగ్రెస్ కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఆ సమయంలో నేను వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి అప్పటి సీఎస్‌కు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన నెంబర్ ఉందని అధికారులు చెప్పడంతో విచారణ కోసం తాను విచారణాధికారుల సమక్షంలో వాగ్మూలం ఇచ్చినట్టు వెల్లడించారు. తనకు వచ్చిన సమాచారం మేరకు కేవలం కాంగ్రెస్ నాయకులే కాదు, బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యారని, ప్రతి ఓటమి చెందిన నియోజకవర్గంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్నారు.
అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, హోం సెక్రటరీలు రాజకీయ నాయకులకు తలొగ్గి ట్యాపింగ్ జరిపించారని ఆరోపించారు. హోదా లేని ప్రభాకర్ రావును ఐజీగా కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయడం వెనక తప్పుడు ఉద్దేశమే ఉన్నదన్నారు. తమను నక్సలైట్ల సానుభూతిపరులుగా చిత్రీకరించి ప్రజల్లో అపోహలు కలిగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ట్యాపింగ్‌కు సంబంధించి హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ సహా బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుని, శిక్షించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకమైన కేసుగా గుర్తించిన విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు.

