బీహార్ Assembly| అసెంబ్లీ ఎన్నికల |Elections నేపథ్యంలో RJD| ఆర్జేడీ నేత TEJASWI యాదవ్| తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని GOVERNMENT JOBS| ప్రభుత్వ ఉద్యోగాలు 100 శాతం బీహార్ స్థానికులకు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ మేరకు చట్టసభలో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. యువతలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తేజస్వి అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో స్థానికులకు న్యాయం జరగడం లేదని ఆయన విమర్శించారు. తన సారథ్యంలో వచ్చే ప్రభుత్వం బీహార్ యువతకు ఉద్యోగాల్లో న్యాయం చేస్తుందని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో ప్రాంతీయతకు మొదటి స్థానం ఉండాలని, ఇతర రాష్ట్రాల మాదిరిగానే బీహార్‌లో కూడా స్థానికుల హక్కులు పరిరక్షణకు నడుం బిగించాం అని తేజస్వి అన్నారు. ఆయన వ్యాఖ్యలు బీహార్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

