విమానం దుర్ఘటనకుAEROPLANE ACCIDENT| పై OFFICIAL| అధికారిక ప్రకటన
GUJARAT| గుజరాత్‌లో ఘోర AEROPLANE ACCIDENT|విమాన ప్రమాదం జరిగింది. లండన్‌కు వెళ్లాల్సిన ఏయిర్ ఇండియా విమానం (AI-171), అహ్మదాబాద్‌లోని డాక్టర్ల హాస్టల్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి ఏయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రస్తుతం ప్రాధాన్యత కల్పించాల్సింది బాధితులకు అండగా నిలబడటమేనని పేర్కొన్నారు. అత్యవసర సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సహాయక చర్యల్లో అన్ని విభాగాలు చురుగ్గా పాల్గొంటున్నాయని స్పష్టం చేశారు.

విమానాశ్రయ అధికారుల సమాచార ప్రకారం, మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఈ విమానంలో ప్రయాణిస్తున్నారని చెప్తుండగా, విమాన ప్రమాదానికి గురైన ఏయిర్ ఇండియా విమాన ప్రయాణికుల జాబితాలో మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ పేరు ఉన్నప్పటికీ, ఆయన మరో విమానంలో ప్రయాణించినట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు స్పష్టత ఇస్తూ, అధికారికంగా సమాచారం ఇచ్చారు. విజయ్ రూపానీ సురక్షితంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా నిలిపివేయబడింది. విమానాశ్రయం అధికారుల సమాచార ప్రకారం, అన్ని విమానాల రాకపోకలు నిలిపివేశామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే రెండు మూడు నిమిషాల్లోనే పోలీస్, ఫైర్ సర్వీసు, మెడికల్ టీంలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, ప్రస్తుతం దాదాపు 70-80 శాతం ప్రాంతాన్ని శుభ్రం చేశామని అహ్మదాబాద్ పోలీస్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమంది మృతిచెందినదీ లేదా గాయపడినదీ స్పష్టంగా తెలియరాలేదు. సహాయక బృందాలు శరవేగంగా పనులు కొనసాగిస్తున్నాయి.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. వెంటనే అహ్మదాబాద్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా వారిని ఆదేశించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన స్థలాన్ని వెంటనే ఖాళీ చేసి, మిగిలిన ప్రాంతాలను పరిశీలించి, బాధితులకు అన్ని విధాలుగా సహాయపడేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అధికారికంగా మృతుల సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రభుత్వం, ఏయిర్ ఇండియా అధికారులు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

అందులో పరాయనిస్తున్న ప్రయాణీకుల వివరాల కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి.

