వివాహంపై భారీ చర్చ
తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా తన వ్యక్తిగత జీవితం ద్వారా మరోసారి వార్తల్లోకెక్కారు. మే 3న జర్మనీలో బిజు జనతా దళ్ (BJD) సీనియర్ ఎంపీ పినాకి మిశ్రాతో ఆమె రహస్య వివాహం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వివాహం ఏ పార్టీ వర్గాల్లోనూ అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఆత్మీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది.
ఇంతకుముందు మహువా డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకోగా, తర్వాత న్యాయవాది జై అనంత్ దేహాద్రాయితో సన్నిహితంగా ఉన్నారు. అయితే ఆ సంబంధం తెగిపోవడంతో దేహాద్రాయిని ఆమె “jilted ex”గా పిలిచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీఎంసీ సీనియర్ నాయకుడు కల్యాణ్ బెనర్జీ చేసిన మహువా మొయిత్రా బాయ్‌ఫ్రెండ్స్ అన్నీ ఇతర పార్టీలవారే అనే వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విభిన్న పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య రహస్య వివాహం జరగడం రాజకీయంగా నూతన చర్చలకు తావిస్తోంది. ఇది టీఎంసీ, బిజేడీ మధ్య సంబంధాలపై ఏవైనా ప్రభావాలు చూపుతాయా? అనే సందేహాలు మొదలయ్యాయి.

