ఆవిష్కరించిన MINISTER|మంత్రి PONGULETI|పొంగులేటి, MLA|ఎమ్మెల్యే YASHASWINIయశస్విని, JHANSI REDDY|ఝాన్సీ రెడ్డి
STATE FORMATION DAY|రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున చరిత్రాత్మక ఘట్టం
CONGRESS|కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్ళతో భారీ ర్యాలీ
జనగామ(పాలకుర్తి), జూన్ 2 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనకు గుర్తుగా పాలకుర్తి పట్టణం మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. దేశముఖ్ లను ఎదిరించిన గడ్డ, ఉద్యమాల ఖిల్లా, ఎందరికో ఉద్యమ స్ఫూర్తిని అందించిన పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజీవ్ చౌరస్తాలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలో రెండవ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ అనంతరం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తొలి విగ్రహానంతరం, జిల్లాల్లో మొదటిసారిగా పాలకుర్తిలో ఏర్పాటు చేసి ఆవిష్కరింపచేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిలను అభినందిస్తున్నానన్నారు. అలాగే గత ఏడాదిన్నరగా ఆర్థిక పరిస్థితి గడ్డుకాలంగా నిలిచినప్పటికీ, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ధరణి’ వ్యవస్థలో కనిపించిన గందరగోళానికి విరుద్ధంగా, సంపూర్ణ నియమ నిబంధనలతో రూపొందించిన ‘భూబారతి’ పోర్టల్ ఆగస్టు 15 నాటికి ప్రతి రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు. రాబోయే 2 నెలల్లో పది వేల సర్వేయర్లకు శిక్షణ, ఆరు వేల మందికి నియామకం, అన్ని మండలాల్లో ట్రైనింగ్ బృందాలు
పనిచేయడం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు తక్షణం మంజూరు, మెటీరియల్ బిల్‌ను స్థాయికి తగ్గట్టు చెల్లింపు చేస్తున్నామన్నారు. దశలవారీగా మొత్తం 20 లక్షల ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వైద్యం, సన్న బియ్యం, 17 లక్షల రేషన్ కార్డులు, 56 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు పూర్తి చేశామన్నారు. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఊహించని దరఖాస్తులు రావడం ప్రజా ప్రభుత్వంపై యువతకు ఎంత నమ్మకం ఉందో తెలుస్తుందని గర్వంగా తెలిపారు. అలాగే మాజీ మంత్రి ఎర్రబెల్లిని ఉద్దేశిస్తూ, చచ్చిన పామును చంపాలన్న ఉద్దేశ్యం లేదు, అయితే తోక జాడిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రను సగర్వంగా గుర్తు చేస్తూ మన ప్రాంతంలో రెండవ విగ్రహం పెట్టడం తమకు ఎంతో గర్వకారణంగా వుందన్నారు. ఈ విగ్రహం మహిళల అస్తిత్వానికి, ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు రూపమని చెప్పారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విగ్రహ ఏర్పాటు మన ప్రాంతానికి ఒక మైలు రాయి మాత్రమే కాదని, పాలకుర్తిలో ఆత్మగౌరవాన్ని నిలబెట్టే చిరస్థాయి గుర్తు అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆరు మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు తదితరులు పాల్గొనగా, కళాబృందాల జానపద నృత్యాలు, ఆటపాటలతో, భారీ ర్యాలీ నిర్వహించారు.


దళిత కుటుంబం ఇంట్లో భోజనం
కార్యక్రమం అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అడిషనల్ కలెక్టర్లు రోహిత్ సింగ్, పింకేశ్ కుమార్ పాటిల్, డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఏసిపి నర్సయ్య తదితరులు పాలకుర్తిలో దళిత వర్గానికి చెందిన గాదేపాక ఎల్లయ్య ఇంటికి వెళ్ళి, వారి ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో వండిన అన్నంతో భోజనం చేశారు.

పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే|MLA
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత పాలకుర్తి మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి లు ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని ప్రత్యేక నృత్య కార్యక్రమాలను తిలకించారు.

