HUMAN RIGHTS|మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర విమర్శలు
2025 మే 21న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అబూజ్‌మాడ్ ప్రాంతంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్ ఘటన అనంతరం పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల మృతదేహాలు ఇప్పటివరకు వారి బంధువులకు అప్పగించకుండా అధికారులు ఆలస్యం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మృతుల విషయమై వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారు. మృతదేహాలను గుర్తించినప్పటికీ మే 24 నాటికీ కూడా వాటిని అప్పగించకపోవడాన్ని శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ప్రో. హరగోపాల్|PROF.HARAGOPAL, ప్రో. లక్ష్మణ్|PROF.LAKSHMAN, డా. ఎంఎఫ్ గోపీనాథ్|DR.MF.GOPINATH, కవిత శ్రీ వాత్సవ|KAVITHA SRIVASTAVA, క్రాంతి చైతన్య|KRANTHI CHAITANYA, మీనా కందసామి|MEENA KANDASAMI తీవ్రంగా ఖండించారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI
ఛత్తీస్‌గఢ్ అడ్వకేట్ జనరల్|ADVOCATE GENERAL హైకోర్టు|HIGH COURTలో తెలిపిన నివేదిక ప్రకారం, మృతదేహాలను సురక్షితంగా భద్రపరిచినట్టు చెబుతుండగా, వాస్తవంగా అవి దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు అందుబాటులోకి రాకుండా చేయడంపై ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, మరణించిన వ్యక్తుల మానవ హక్కుల పరిరక్షణకు భంగం కలిగిందని కమిటీ సభ్యులు అన్నారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI
ఈ సందర్భంగా శాంతి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఒక మృతదేహాన్ని ఖచ్చితంగా గుర్తించిన తరువాత కూడా బంధువులకు అప్పగించకుండా ఆలస్యం చేయడం అమానవీయ చర్య. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గల వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులకే భంగం,” అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాల ప్రకారం కూడా మృతులపై గౌరవంగా వ్యవహరించాలి. మరణించిన వారి మతాచారాలు, సంస్కృతి మేరకు వారి అంత్యక్రియలు జరపడం మానవతా ధర్మమని గుర్తు చేశారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI
అంతేకాక, మృతుల బంధువులు, సహాయక సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు కూడా అధికారుల నుంచి బెదిరింపులకు గురవుతున్నారని కమిటీ సభ్యులు వెల్లడించారు. అధికారుల ప్రవర్తన కేవలం పరిపాలనా విఫలం మాత్రమే కాదు, మానవ హక్కుల ఉల్లంఘనకు తాలూకు ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం మృతులపై గౌరవంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చిచెప్పారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI
ఈ నేపథ్యంలో కోఆర్డినేషన్ కమిటీ తమ డిమాండ్లు ప్రకటించింది:
1. ఇకపై మరింత ఆలస్యం లేకుండా మృతదేహాలను తక్షణమే బంధువులకు అప్పగించాలి.
2. మృతుల కుటుంబాలను బెదిరించే ప్రయత్నాలు నిలిపివేయాలి.
3. జాతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను పూర్తిగా పాటిస్తూ చర్యలు తీసుకోవాలి.
4. మృతదేహాల నిర్వహణలో తగిన అధికార ప్రోటోకాల్స్‌ను అనుసరించాలని కోరారు.
చివరగా, ఈ ఘటనకు బాధ్యత వహించి, మృతుల బంధువులకు పూర్తి గౌరవం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని, హైకోర్టు సమక్షంలో ప్రభుత్వం స్పందించాలని శాంతి కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు కోరారు. CHATTISGARH|ENCOUNTER|DEAD BODY|PEACE|PROF.HARAGOPAL|PROF.LAKSHMAN|DR.MF.GOPINATH|KAVITHA SRIVASTAVA|KRANTHI CHAITANYA|MEENA KANDASAMI

