BRS|బిఆర్ఎస్ లో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి
KAVITHA|కవిత-కేటీఆర్|KTR మధ్య విభేదాలతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై విపక్షాల దాడులు ముదురుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంట్లోనే కుంపటి తట్టుకోలేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. పార్టీపై తన ఆధిపత్యానికి భంగం కలిగేలా మరో పవర్ సెంటర్ రూపంలో కవిత ఎదగడంతో, కేటీఆర్ మతిభ్రమించి CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|
ఇటీవలి కాలంలో కవితపై వచ్చిన విమర్శలు, కేసులు, నోటీసుల వ్యవహారాలను మరల్చేందుకు కేటీఆర్ జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నది మహేష్ గౌడ్ ఆరోపణ. ముందుగా తన ఇంట్లోనే రగులుతున్న అగ్ని అణుచుకోవాలి. పది సంవత్సరాల పాలనలో జరిగిన టీఆర్ఎస్ తప్పిదాలను ప్రజలకు కవితే గుర్తు చేస్తోంది, అని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|
కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు పార్టీ నాయకుల మౌనమే స్పష్టంగా చెబుతోందని ఆయన అన్నారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్‌కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని చెప్పిన మాటలు, పార్టీని మరింత అస్థిరతవైపు నడిపిస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వీటన్నింటి కారణంగా బీఆర్ఎస్ మూడు ముక్కలవుతుందని, కవిత, కేటీఆర్ మధ్య అంతర్గత పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఎప్పుడైనా తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని గౌడ్ విమర్శించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|
ఇక పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా ఒంటరిగా ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారని, ఆయన చుట్టూ ఉన్న మానవ రూప దయ్యాలు ఎవరో ప్రజలకు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్ర నోటీసులు వస్తుండటంతో కేటీఆర్ భయంతో చెమటలు పడుతున్నారని అన్నారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం అందించలేకపోయిందని, పంపకాల్లో తేడాల కారణంగానే కవిత కూడా ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండకపోవచ్చని ఆయన హెచ్చరించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

