కేటీఆర్‌పై MINISTERS|మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ మండిపాటు
TELANGANA|తెలంగాణ రాజకీయంగా మరోసారి మాటల తూటాలు పేలాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీడియా ముందుకు వచ్చి ఘాటుగా స్పందించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA
సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్ మెదడు చితికిపోయినట్లుంది అంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన అవినీతిపై ఘాటుగా స్పందించారు. కమీషన్ తీసుకున్నప్పుడు భయం లేదు, ఇప్పుడు అది బయటకు రాగానే భయపడుతున్నారా? అంటూ ప్రశ్నించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA
కేటీఆర్ చేసిన విమర్శల్ని గోబెల్స్ ప్రచారంతో పోల్చిన సీతక్క, గోబెల్స్‌ను మించి బలమైన అబద్ధ ప్రచారం నడిపిస్తున్నారు. గ్లోబెల్స్ అవార్డు ఇచ్చే స్థాయి ఉంది మీకంటే! అంటూ ఎద్దేవా చేశారు. కవిత అన్న దెయ్యం, కేటీఆర్ కావొచ్చు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి నీదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. కాళేశ్వరం కూలినప్పుడు అధికారంలో బీఆర్‌ఎస్‌నే ఉందని గుర్తు చేశారు. ఈడీ జేబు కొట్టాలని రాలేదు, అవినీతిపై విచారణకు వస్తుంది. మోదీని పొగిడే ప్రయత్నం చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్, అని వ్యాఖ్యానించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA
ఇక గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ముందుగా మీ కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకోండి. కవితగారు స్వయంగా చెప్పారు… కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారుbఅని. ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ సమాధానం చెప్పాలి అన్నారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA
కవిత, మీడియాకు లీకైన లేఖ ద్వారా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆయన, మీరు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడమంటే, ముందు మీ కుటుంబ సభ్యురాలు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పండి. తర్వాత మేము సమాధానం చెబుతాం అన్నారు. బేస్‌లెస్ ఆరోపణలపై స్పందించమని, అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు.|BRS|KTR|CONGRESS|MINISTERS|PONNAM PRABHAKAR|SEETHAKKA

