అడుగు స్పెషల్ స్టోరీ!
సెకండ్స్ సేల్స్ ఢమాల్!
ఫస్ట్ సేల్స్ కమాల్!
‘పాత’కు పాతర!
‘కొత్త’కు జాతర!
సన్నగిల్లిన ఆసక్తి!?
సొమ్మసిల్లిన కొనుగోలు శక్తి!
శివార్లకు శివాలెత్తుతున్న ‘భాగ్య’నగర పౌరులు
CITY|TO-LET
‘కొత్తొక వింత! పాతొక రోత!!’ సర్వ సాధారణమే అయినా, ఇప్పుడు సిటీ సిటిజెన్స్ కి సరిగ్గా సరిపోయే సామెత. సదుపాయమైనా, మరేదైనా సరే, అంతేనా?, ‘అంతకు మించి…’ అంటున్నారు. కాస్ట్ కాస్త ఎక్కువైనా నో ప్రాబ్లెం.. ఏదైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్… ఇప్పుడు ఇదే సిటీ సగటు జీవి ఫాస్ట్ ట్యాగ్… అందుకే సెకండ్స్ కి సేల్స్ పడిపోయింది. అత్యంత పతనావస్థలో సెకండ్స్ సేల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మధ్య దిగువ తరగతి ప్రజలకు సెకండ్స్ అంటే ఎగపడేవారు. ఇప్పుడు ఎదురుపడేవారే లేకుండా పోయారు. ఇంతకీ, ఈ మహానగరానికి ఏమైంది? ఎవరో అగంతకులు ‘టు లెట్’ బోర్డు తగలేశారు!?CITY|TO-LET
CITY|TO-LET అవును. ఈ మహానగరానికి మాయరోగం వచ్చింది. ఒకప్పుడు రియల్, బిల్డర్ రంగాల బిల్డప్ పీక్స్ లో ఉన్నప్పటికీ, సెకండ్స్ సేల్స్ ఓ మోస్తరుగానైనా ఉండేది. అదేం విచిత్రమోగానీ, రియల్, బిల్డర్ రంగాలు బొక్కాబోర్లా పడ్డాయి. సరే, ఇప్పుడు పెరగాల్సిన సెకండ్స్ సేల్స్ ఢమాల్! మన్నాయి. సప్లయ్, డిమాండ్ ఆర్థిక సూత్రానికి భిన్నంగా, రెండు పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొద్దో గొప్పో కొత్త కోసం పాకులాడుతున్న జనాల్ని చూస్తున్నాం. కానీ విస్తారంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో సెకండ్స్ కి ఏ మాత్రం గిరాకీ లేకుండా పోయింది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది బ్రోకర్లు లేదా మీడియేటర్లు లేదా రియల్టర్లు ఒక్కసారిగా కుదేలైపోయారు. లబోదిబోమంటున్నారు. అసలీ మహానగరానికి ఏమైందని జుట్టు పీక్కుంటున్నారు. ఎవరో అగంతకులు ‘టు లెట్!’ బోర్డు పెట్టారని సెటైర్లు వేసుకుంటున్నారు.CITY|TO-LET
CITY|TO-LETగత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో పాత ఇళ్ళు, ఫ్లాట్స్, అపార్ట్‌మెంట్లకు క్రమంగా గిరాకీ తగ్గిపోయింది. కొత్తగా ఇంటి కోసం వెతికే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ పైనే దృష్టిపెడుతున్నారు. పాత ఇండ్లను కొనాలన్న ఆసక్తి దాదాపు పూర్తిగా తగ్గిపోవడంతో సెకండ్స్ సేల్స్ కి తీవ్ర దెబ్బ తగలింది. ప్రస్తుతం నగరంలోని ప్రముఖ ప్రాంతాలలో వందల సంఖ్యలో పాత ఇళ్లు, ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నా, వాటిని కొనాలన్న మినిమం ఆలోచన కూడా వినియోగదారుల్లో కనిపించడం లేదు.CITY|TO-LET
హిమాయత్‌నగర్ నుంచి తార్నాక వరకు
CITY|TO-LETహైదరాబాద్ మహానగరంలో ఖాళీగా ఉన్న పాత ఇండ్లూ, ఫ్లాట్లు వెలవెలపోతున్నాయి. నగరంలోని హిమాయత్‌నగర్, గగన్‌మహల్, దోమల్ గూడ, నల్లకుంట, రాంనగర్, ముషీరాబాద్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట, పంజాగుట్ట, అంబర్‌పేట్, సికింద్రాబాద్, మెహదీపట్నం, లక్డీకాపూల్, హైదర్‌గూడ, తార్నాక, డీడీ కాలనీ వంటి ప్రాంతాల్లో వేలాది పాత ఫ్లాట్లు, ఇండ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నా కొనుగోలుదారులే కనిపించడం లేదు. ఈ ప్రాంతాల్లో హౌజింగ్ స్పేస్ వదిలే వారు పిల్లల చదువులు, పెండ్లిళ్లు, అనారోగ్య ఖర్చుల కోసం అమ్మకానికి పెట్టినా, నెలల తరబడి నిరీక్షిస్తూనే ఉండాల్సి వస్తోంది.CITY|TO-LET
ఒక్క బేగంపేటలో మాత్రమే డిమాండ్
CITY|TO-LETఇదే సమయంలో బేగంపేటలో మాత్రం పాత ఇండ్లకు గిరాకీ ఉంది. ముఖ్యంగా మార్వాడీ వ్యాపారులు ఈ ప్రాంతంలో గజానికి 10 లక్షల వరకు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఒకప్పుడు సెకండ్ సేల్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వినియోగదారులు పాత ఇళ్లను కన్నెత్తి కూడా చూడడం లేదు. కొత్త ఇళ్ల పట్లే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.CITY|TO-LET
కొత్తకు స్వాగతం! పాతకు వందనం!!
CITY|TO-LETఉదాహరణకు హిమాయత్‌నగర్‌లో కొత్త అపార్ట్ మెంట్‌లో ఫ్లాట్ కొనాలంటే 1 ఎస్సెఫ్టీకి రూ.12 వేలకు పైగా ధర ఉన్నా సరే, కొనుగోలుదారులు అదేదీ పట్టించుకోకుండా, అవే ఫ్లాట్స్ కావాలని ఎగబడుతున్నారు. అదే పాత ఫ్లాట్ 1 ఎస్సెఫ్టీకి రూ.4వేలు అని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల టు లెట్ బోర్డులు పెట్టినా కూడా పట్టించుకునే వారే కరువయ్యారు.CITY|TO-LET
సిటీ ఔట్స్ పై ఆసక్తి!
CITY|TO-LETనగరంలో రద్దీ బాగా పెరిగి, జనజీవనం ఇరుకైపోయి, ఆక్సీజన్ లేవెల్స్ తగ్గి, ఊపిరాడని ట్రాఫిక్, పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారు. సిటీ జనంలో నగరంలో నివాసం ఉండాలన్న ఉత్సాహం తగ్గిపోతోంది. ప్రజలు ఎక్కువగా సిటీ ఔటర్ రింగు రోడ్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, ఫామ్ హౌస్ లను ఎంపిక చేసుకుంటున్నారు. నగరంలో సొంత ఇల్లు కలిగి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాటిని అమ్మేసి శివారుకు శివాలెత్తుతున్నారు.CITY|TO-LET
నిరాశలో బ్రోకర్లు – వెలవెలబోతున్న వెబ్‌సైట్లు
CITY|TO-LETసిటీలో సెకండ్స్ సేల్స్ పై ఆధారపడిన లక్షలాది మంది బ్రోకర్లు లబోదిబోమంటున్నారు. నెలల తరబడి సేల్స్ లేకపోవడంతో కుటుంబంతో బతకడం ఎలా? పిల్లల ఫీజులెలా? ఇంటి రెంట్లు ఎలా? అన్న రంధిలో పడ్డారు. ‘నో బ్రోకర్’, ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో పాత ఇల్లు, ఫ్లాట్స్ అమ్మకానికి పెట్టినట్టు ప్రకటనలున్నా, వాటిపై స్పందన కనిపించడం లేదు. నెలల తరబడి ఆ ప్రాపర్టీలు అలానే ఉంటున్నాయి.CITY|TO-LET
CITY|TO-LETకొనుగోలుదారులే లేకపోవడంతో, అత్యవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకున్న ఓనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏన్నో ఆశలు పెట్టుకున్నా, కనీస మద్దతు ధర కూడా పలకని పరిస్థితుల్లో బెంబేలెత్తున్నారు. హైదరాబాద్ నగరంలో సెకండ్స్ సేల్స్ విభాగం పూర్తిగా పడిపోవడంతో ఈ రంగంలో కొనసాగుతున్న వారు భవిష్యత్ పట్ల భయభ్రాంతులకు లోనవుతున్నారు. సెకండ్స్ సేల్స్ రంగం సమీప భవిష్యత్తులో పుంజుకోకపోతదా!? అన్న ఆశలో ఉన్నారు.CITY|TO-LET

