17 మందికి దవాఖానల్లో చికిత్స
CM సీఎం, minister మంత్రి పొన్నం దిగ్బ్రాంతి
హైదరాబాద్, పాతబస్తీలోని గుల్జార్ హౌస్ సమీపంలో ఉదయం 6:16 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా గాయపడిన వారిని యశోద మలక్‌పేట (8 మంది), అపోలో హైదరుగూడా (5 మంది), అపోలో DRDL (2 మంది), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (1), కేర్ నాంపల్లీ (1) కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి క్షణం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, బాధితులకు అవసరమైన వైద్య సాయం అందించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి తమ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రమాద స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అక్కడి అధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకుని, బాధిత కుటుంబాలను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని అవసరమైన చర్యలు చేపడుతున్నామని, బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు.
ఈ ఘటనలో నాలుగు ఉమ్మడి కుటుంబాలు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలు సెలవుల నేపథ్యంలో అక్కడికి వచ్చినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగిందన్న వార్తల నేపథ్యంలో అధికారికంగా మరణాల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అధికారులు, వైద్య బృందాలు, పోలీస్, ఫైర్ శాఖలు ఘటనా స్థలంలో చర్యలు కొనసాగిస్తున్నాయి.
అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగినదే అని ప్రభుత్వం ప్రకటించింది. ఎటువంటి కుట్ర కోణం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు సమగ్రంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల మరిన్ని ప్రాణ నష్టం తప్పినట్లు పేర్కొన్నారు.

