మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు
|Konda Surekha|Comments|Sensational|Telangana
మంత్రి కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆమె స్పష్టత ఇచ్చారు. “నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు,” అంటూ బీఆర్ఎస్ నేతలపై ఆమె మండిపడ్డారు. “నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను,” అని మంత్రి స్పష్టం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana
బీఆర్ఎస్ హయాంలో మంత్రుల పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రతి ఫైల్‌కు ముడుపులు తీసుకునే అలవాటు ఆ సమయంలో ఉండేదని ఆమె ఆరోపించారు. “ఇది నిజమా కాదా అన్నదీ బీఆర్ఎస్ నేతలకే తెలుసు. కానీ ఇప్పుడు నా వ్యాఖ్యలను వక్రీకరించడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. పెయిడ్ సోషల్ మీడియా వేదికగా నా మాటల్ని ఎడిట్ చేసి, ముందు వెనక భాగాలు తొలగించి, కావాలనే వీడియో క్లిప్‌ను హైలైట్ చేస్తూ, మా మంత్రివర్గ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు,” అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana
“ఈ కుట్రలు బీఆర్ఎస్ నాయకుల అసహనానికి నిదర్శనాలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పాలన అందిస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి దుష్ప్రచారాలకు తెగబడుతున్నారు,” అని సురేఖ మండిపడ్డారు. ఆమె చెప్పినట్లుగా, తన వ్యాఖ్యలు పూర్తిగా గత ప్రభుత్వంలోని అవినీతిపైనే ఉన్నాయని, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రి సహచరులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana
“బీఆర్ఎస్ హయాంలో ‘పైసలు ఇస్తేనే ఫైళ్లు కదలుతాయ’న్న అభిప్రాయం ప్రజల్లో బలంగా పడింది. అప్పటి మంత్రుల నిర్వాకం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. దళిత బంధు, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో ముట్టడిపోయిన కమిషన్ల బాగోతాలను మీ సీఎం కేసీఆర్ గారే స్వయంగా బయటపెట్టారు. ఒక మంత్రి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటాడని చెప్పిన ఘనత కూడా మీకే చెందుతుంది. ఇదే కారణంగా ప్రజలు మిమ్మల్ని ఓటుతో గుణపాఠం చెప్పారు,” అని మంత్రి తెలిపారు.|Konda Surekha|Comments|Sensational|Telangana
“ఇప్పటికీ మీ బుద్ధి మారలేదు. ప్రతి అంశాన్ని వక్రీకరించి వక్రబాష్యం చెబుతున్నారు. ఇలా చేస్తూ మీ అసలు స్వరూపాన్ని ప్రజల ముందే బయటపెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి, అబద్ధాలకు పుట్టిన విష పురుగు. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెబుతారు. మళ్లీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే అస్సలు సహించేది లేదు. తగిన చర్యలు తీసుకుంటాం,” అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర హెచ్చరికలు చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

