రాష్ట్ర విద్యుత్ రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష
|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana
రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరింది. గత ఏడాదితో పోల్చితే ఇది 9.8 శాతం అధికమని తెలిపారు. అలాగే వచ్చే 2025-26 లో డిమాండ్ 18,138 మెగావాట్లకు పెరగనుండగా, 2034-35 నాటికి ఇది 31,808 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana
సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తోందని, ప్రభుత్వం చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులు, రైల్వేలు, మెట్రో, మాస్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడల విద్యుత్ అవసరాలను అంచనా వేసి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana
హైదరాబాద్ డేటా హబ్‌గా మారబోతుందన్న సీఎం, డేటా సిటీ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్‌లకు అవసరమైన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సబ్ స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయాలని, విద్యుత్ లైన్ల ఆధునీకరణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana
ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్ కనిపించకుండా భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు చేపట్టాలని, హై టెన్షన్ లైన్లను అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్‌ను అమలు చేయాలని, సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో 160 కిలోమీటర్ల పొడవున సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించాలని, జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలాలలోనూ సోలార్ విద్యుత్ సాధ్యసాధ్యతలు పరిశీలించాలని సూచించారు.|Review|CM|Revanth Reddy| Electricity|Department|Hyderabad|Telangana

