పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ పై దాడి చేసే ప్రయత్నం చేసింది. జమ్మూ కాశ్మీర్ లో ప్రసిద్ధ శంభూ ఆలయం, పరిసర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా సాయుధ డ్రోన్‌లను భారత భూభాగంలోకి పంపింది. శంభూ ఆలయం పరిసరాల్లో జరిగిన పేలుళ్లతో ప్రజల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టాయి. శబ్దాలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ డ్రోనుల దాడితో భారత భద్రతా దళాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. భారత ఆర్మీ సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అన్ని చర్యలు చేపట్టాయి. ప్రజల రక్షణకు తగిన భద్రత కల్పిస్తూ, డ్రోన్‌లకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.ప్రజలపై చేస్తున్న దాడులను భారత్ ఉపేక్షించదని రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.

