సాధారణ మహిళగా కూరగాయలు కొన్న MLA యశస్విని
అమ్మా..! బాగున్నవా? గిరాకీ బాగుందా? బుడంకాయలు ఎక్కడ దొరికినయి? నువ్వే పండిస్తావా…? ఎక్కడ ఎరుకొచ్చినావ్? మంచిగానే ఉన్నాయి కదా…. నాకు కావాలే మంచియి ఇయ్యి అమ్మా…. అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సాధారణ మహిళగా కూరగాయలు కొంటుంటే… మంచిగా ఉన్నాయి నేను ఏరి ఇస్తా… బిడ్డా… అంటూ కూరగాయలు అమ్ముకునే మహిళ చెప్తున్న ఘటన తన కార్యక్రమాల నిమిత్తం పాలకుర్తి నుండి జనగామ వెళ్తూ…మార్గ మధ్యలో కోలుకొండ గ్రామం దాటిన తరువాత బుడంకాయలు కనిపించగానే ఎమ్మెల్యే కారు ఆపి మరీ వాటితో పాటు మిగతా… కూరగాయలు కొన్నారు. తాను ఎమ్మెల్యే గా ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే, ప్రజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ… సాధారణ మహిళగా కుటుంబాన్ని కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందని వారు ఈ ఘటనతో అక్కడి వారికి అందరికి అర్థం చేశారు. ఈ దృశ్యాలు చూసిన ఆ రోడ్డుపై ఉన్న ప్రయాణికులు సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు.


