అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని తమ నివాసంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మీడియా ప్రకటనలోఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ సమాజ పరిరక్షణ, సామాజిక సమానత్వం, విద్యా అభివృద్ధికి చేసిన కృషి ఇప్పటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని, ఆయన కలలు కన్నా భారత్ ను నిర్మించడమే లక్ష్యంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహానేతలను స్మరించుకోవడం సరిపోదని, వారి ఆలోచనలను మనమంతా ఆచరణలోకి మార్చుకొని, ప్రజల శ్రేయస్సు కోసం కార్యరూపంలోకి తేవాలని సూచించారు. అంబేద్కర్ జీవితం ప్రతి ప్రజాప్రతినిధికి ఒక ప్రేరణ అని చెప్పారు.

