డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు గాజులరామారం డివిజన్‌లోని సూరారం, శివాలయ నగర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా ఇంచార్జ్ మల్లారెడ్డి, బీజేపీ జనరల్ సెక్రటరీ గిరివర్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి భరత్ సింహారెడ్డి, కార్పొరేటర్ శేషగిరి, బీజేపీ స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ వాసు, దళిత సంఘం ఐక్యవేదిక చైర్మన్ జేమ్స్, జనరల్ సెక్రటరీ అనుమకొండ ప్రేమ్ కుమార్, నేతలు సిద్దయ్య, యాదగిరి మాదిగ, శ్రీనివాస్ మాదిగతో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడం కోసం అందరూ కృషి చేయాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

