మరోసారి రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామంలో గల కోళ్ళ ఫారంలోని కోళ్ళకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఒక కోళ్ళ ఫారంలో 500 కోళ్ళు బర్డ్ ఫ్లూ సోకి మృతి చెందాయని, దీంతో 52 వేల కోళ్ళు, 17 వేల కోడి గుడ్లు, 85 టన్నుల దానాను భూమిలో పూడ్చిపెటినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వరుస బర్డ్ ఫ్లూ సంఘటనలతో నష్టాల్లో పేరుకపోతున్నామని కోళ్ళ ఫారం యజమానులు, మాంసం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

