తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని
జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వానకొండయ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిలు హాజరై స్వామి వారికి తలంబ్రాలు సమర్పించి, మొక్కులు తీర్చుకోగా, ఆలయ అర్చకులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు. కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు, మహిళ నాయకులు, గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు, పాల్గొన్నారు.








