ఆటా నూతన కార్యవర్గం ఎన్నిక
ఆటా చేయబోయే కార్యక్రమాలపై చర్చించిన అధ్యక్షులు జయంత్ చల్లా
ఆటా చేయబోయే సేవ కార్యక్రమాలకు లక్ష డాలర్లు విరాళంగా వచ్చాయని అమెరికా తెలుగు సంఘం(ఆటా) అధ్యక్షులు జయంత్ చల్లా ప్రకటించారు. అమెరికా, వర్జీనియా రాష్ట్రంలో గల యాష్ బర్న్ లో ఆటా నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జయంత్ చల్లా మాట్లాడుతూ….ఆటా స్థాపించడానికి గల కారణాలను, ప్రధాన లక్ష్యాలను వివరించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగుజాతికీ, వారి సాంస్కృతిక వారసత్వానికి, తెలుగు సాహిత్యానికి, సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యకలాపాలు ప్రోత్సహించటానికి ఆటా అన్నివేళలా కృషి చేస్తుందని పునర్ఘటించారు. అలాగే నూతనంగా ఎన్నికైన కార్యనిర్వహక బృందం తమ రెండు సంవత్సరాల కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను చర్చించి భవిష్యత్ కార్యాచరణను తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, అదే విధంగా ఇమ్మిగ్రేషన్ పై అవగాహన సదస్సులు, అమెరికాలో ఉండే హై స్కూల్ విద్యార్థుల కు ఉచిత శిక్షణ, కాలేజీ ప్రవేశాలపై అవగాహన సదస్సులు, భారత్ దేశం నుండి తాత్కాలికంగా వచ్చే తల్లిదండ్రులకు అవగాహన, ఉచిత వైద్య, దంత వైద్య క్యాంపు, అవసరమైనవారికి ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. జయంత్ చల్లా టీం వచ్చే రెండు సంవత్సరాలకు లక్ష డాలర్స్ ఆట సేవ కార్యక్రమాలకు విరాళాలు అందించారు.
ఆటా నూతన కార్యనిర్వహణ కమిటీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా సతీష్ రెడ్డి రామశయం, సెక్రటరీ గా సాయినాథ్ బోయపల్లి, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జాయింట్ సెక్రటరీ గా నర్సిరెడ్డి గడ్డికోపుల, జాయింట్ ట్రెజరర్ గా విజయ్ తుపల్లి, ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్ గా అరవింద్ ముప్పిడి లు ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో పాటు వర్జీనియా, మేరీల్యాండ్ లో నివసిస్తున్న తెలుగు వారు కలిపి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

