తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 5 ఎమ్మెల్సీ సీట్లలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా 4 సీట్లు కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలకు, ఒక సీటు BRS పార్టీకి ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ వుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరుపున అద్దంకి దయాకర్, విజయశాంతి, కేతావత్ శంకర్ నాయక్ లను, బిఆర్ఎస్ పార్టీ తరపున దాసోజు శ్రావణ్ లను అభ్యర్థులను ప్రకటించగా, మరొక అభ్యర్థిని ఆదివారం రాత్రి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గం ప్రత్యేకంగా సమావేశమై సిపిఐ పార్టీ తరఫున నెల్లి సత్యం అభ్యర్థిగా నిర్ణయించామని తెలిపారు.

