కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 2014-15 సంవత్సరానికి సంబంధించి సేకరించిన ధాన్యం బకాయిలు రూ. 1,468.94 కోట్లను విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద సరఫరా చేసిన బియ్యానికి సంబంధించిన రూ. 343.27 కోట్ల బకాయిలను విడుదల చేయాలని, కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ గడువును పొడిగించాలని కోరారు.

