ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్, మే లో 44-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుంది. 1901-2025 సగటు ఉష్ణోగ్రత తీసుకుంటే ఈ ఏడాదే ఎండ తీవ్రత అధికమని తెలిపింది.

