తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తగా నియమితులైన AICC ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌తో గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులపై వారికి వివరించి, చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు హెచ్. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

