జనగామ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో గల స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఉదయమే దేవాలయ పూజారులు పూజలు నిర్వహించి ధ్వజారోహణం చేశారు. ఈ పూజల్లో ఇది ఆలయ ఈఓ మోహన్ బాబు, అర్చకులు దేవగిరి రామన్న, లక్ష్మన్న, డివిఆర్ శర్మ, అనిల్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ, సునీల్ శర్మ, సంతోష్ శర్మ, శ్యామ్ శర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.



