మెదక్ జిల్లా కలెక్టరేట్ లోకి ద్విచక్ర వాహనాలను అనుమతించేందుకు కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చారు. ద్విచక్ర వాహనం కలెక్టరేట్ లోకి అనుమతించాలంటే తప్పనిసరి హెల్మెట్, వాహన ల పత్రాలు ఉండాల్సిందే లేదంటే వాహనాలను బయటే నిలిపి లోనికి నడుచుకుంటూ రావాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఈ రోజు నుండి ప్రధాన గేటు వద్ద సిబ్బంది వాహనాలను తనిఖీ చేసి నిభందనలు పాటించని వారిని లోనికి అనుమతించలేదు. హెల్మెట్ లేని వారి వాహనాలను బయటే ఆపివేసి కాలినడకన లోపలకి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా చేస్తే ప్రజల్లో అవగాన వస్తుంది అని పేర్కొన్నారు.

