పార్టీ నిబంధనలకనుగుణంగా పనిచేయాలి
తప్పు చేస్తే ఎవరైనా సరే బాధ్యత వహించాలి
రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
పార్టీ అంతర్గత విషయాలు మీడియాతో మాట్లాడటం తప్పని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం రాజాసింగ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. మాట్లాడుతూ…. రాజాసింగ్ మా పార్టీ నాయకుడే కావచ్చు కానీ పార్టీ అంతర్గత విషయాలు మీడియా తో మాట్లాడడాన్ని తప్పు పడుతున్నాను అన్నారు. పార్టీ సమ సమాజ స్థాపనకు పనిచేస్తుందని, వ్యక్తుల కోసం పనిచేయదనే విషయాన్ని గుర్తించాలన్నారు. వ్యక్తుల కోసం పార్టీ నిబంధనలు మార్చడం కుదరదు అన్నారు. పార్టీలో ఎవరికైనా ఏ సమస్య ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు తో మాట్లాడాలన్నారు. రాజాసింగ్ మా పార్టీ నాయకుడే, మా ఎమ్మెల్యేనే, కానీ ఆయనకు ఏ బాధ ఉండొచ్చు నేను కాదనడం లేదు అని సంజయ్ అన్నారు. కానీ ఇలా మీడియా తో మాట్లాడం సరికాదు అన్నారు. ఇప్పుడు కరీంనగర్ అధ్యక్షుడిని కూడా ఇంకా… ప్రకటించలేదు. అలా అని నేను మీడియాతో మాట్లాడలేదు అన్నారు. ఎవరైనా పదవులు ఆశిస్తే జాతీయ నాయకత్వం ఆదేశాలతోనే పార్టీ పదవులు రాష్ట్ర నాయకత్వం ఇస్తుందని చెప్పారు. రాజా సింగ్ తో కొందరు రెచ్చగొట్టి మాట్లాడించి ఉంటారని బండి సంజయ్ అన్నారు. దయచేసి బిజెపి పార్టీ నాయకులు ఏ సమస్య ఉన్న పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.

