మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు గచ్చిబౌలిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. అనంతరం, సీఎం రేవంత్ టీ-హబ్‌లో గూగుల్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నారు. నానక్రామ్‌గూడ HGCLలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ వంటి ప్రభుత్వ పథకాల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు.

