ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఎన్నికల్లో తమ ఓటమికి కారణాన్ని వివరించారు. తాము ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా పాలన కొనసాగించామని, అదే ఓటమికి కారణమైందని అన్నారు. ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ఈ పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. త్వరలోనే వైఎస్ జగన్ 2.0 పాలన మొదలవుతుందని, తమ ప్రభుత్వం 25-30 ఏళ్ల పాటు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై తప్పు చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు.

