సీఎం కమిట్మెంట్ కు అభినందన
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్‌ను అభినందించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఈ ప్రక్రియకు తాను పూర్తి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. ఉపకులాల వర్గీకరణలో ఉన్న ప్రధాన సమస్యలను సీఎంకు వివరించిన ఆయన, రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగలు మరియు ఇతర ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ, న్యాయ కమిషన్ నివేదికలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వర్గీకరణ ప్రక్రియ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనేలా కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. అసెంబ్లీలో వర్గీకరణ తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన పోరాటాన్ని గుర్తు చేసిన ప్రతినిధులు, సమస్యలను కేబినెట్ సబ్ కమిటీ, కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎంకు సూచించారు.

