ఏపీకి చెందిన ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్లోని జబల్‌పూర్ జిల్లా సిహోరా వద్ద జాతీయ రహదారి-30పై మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏపీకి చెందిన ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహాకుంభమేళాలో పాల్గొని స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న మరికొంతమందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సును ఢీకొట్టిన లారీ అధిక వేగంతో వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

