పులి వంటి భయంకర జంతువును చూడగానే ఎవరైనా గుబులు పడతారు. జూలో దూరంగా నుంచే చూస్తారు, దగ్గరకు వచ్చినా ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ ఓ చిన్నారి మాత్రం అలా భయపడలేదు. ఓ కుటుంబం జూ కి వెళ్లిన సందర్భంగా, చిన్నారి సరదాగా చుట్టూ తిరుగుతూ పులి ఉన్న బోను వద్ద ఆగాడు. అదే సమయంలో లోపలున్న పులి అతని టీ-షర్ట్‌ను నోటితో పట్టుకుంది! సాధారణంగా అలాంటి సమయంలో ఎవరైనా భయంతో పరుగెత్తిపోతారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం భయపడలేదు. అసలు భయపెట్టింది పులి కాదు, అమ్మ! “టీ-షర్ట్ చినిగితే అమ్మ తిడుతుందని” పెద్దగా అరిచాడు. టీ-షర్ట్ వదిలేయాలని పులిని బతిమాలాడు. పులి అంటే భయం లేకపోయినా, అమ్మ తిట్టే భయం మాత్రం ఎక్కువగా ఉందని ఈ ఘటన నిరూపించింది.

